టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
షూటింగ్స్ తో బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే పూజాహెగ్డే తన వర్కౌట్ వీడియోలతో అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. తాజాగా స్లో మూవ్ మెంట్స్ తో వర్కవుట్ చేయడమెలాగో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని పూజాహెగ్డే షేర్ చేశారు . జిమ్ కోచ్ సమక్షంలో ఎంతో ఒడుపుగా చేతులు కాళ్లను కదులుస్తూ నడుము వంచి శ్రమిస్తూ పూజా చేసిన వర్కౌట్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: