టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. తన బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించాడు దిల్‌రాజు, శిరీష్. ఇక ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ రెడ్డి. హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఈసినిమాకు కూడా చాలా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ పోన్ బాట పట్టడంతో మిగిలిన చిన్న సినిమాలకు మాత్రం మంచి అవకాశం దక్కింది. అందుకే వరుసపెట్టి చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే రెండు మూడు రోజుల క్రితమే ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేసింది చిత్రయూనిట్. అయితే డేట్ మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. జనవరి 14న ఈసినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.
#RowdyBoys in theatres on January 14th.
Get ready for love, action and a dose of drama💥
A Rockstar @ThisIsDSP Musical#RowdyBoysOnJan14th #Ashish @anupamahere @HarshaKonuganti @Madhie1 @SVC_official @adityamusic #sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad pic.twitter.com/hYfZjCEIDv
— Sri Venkateswara Creations (@SVC_official) January 7, 2022
కాగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: