అగ్రహీరో బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖండలో అఘోర పాత్రలో విశ్వరూపం చూపించగా.. గోపీచంద్ మలినేని తన సినిమాలో బాలయ్య ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమాలో విలన్ కోసం దునియా విజయ్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు మరో టాలెంటెడ్ నటిని కూడా ఈసినిమాకోసం రంగంలోకి దించుతున్నారు. ఆ నటి ఎవరో కాదు వరలక్ష్మీ శరత్ కుమార్. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఆ సినిమాలో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి పేరు రావడంతో… గోపీచంద్ మలినేని ఆమెను ఈ సినిమాలోకి కూడా తీసుకున్నాడు.
Team #NBK107 welcomes the most talented & versatile actress @varusarath5 on board 💥💥
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/0KjcvVtsKZ
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2022
కాగా ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రాక్ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించాడు గోపిచంద్. ఇక ఈసినిమాను కూడా రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈసినిమాకోసం రీసెర్చ్ కూడా బాగానే చేశాడు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: