మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “అల.. వైకుంఠపురములో.. ‘ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇప్పుడు “పుష్ప:ది రైజ్”తో మరో భారీ హిట్ అందుకున్నారు. బాలీవుడ్ లో పుష్ప: ది రైజ్” మూవీ పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించకపోయినప్పటికీ భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. ఇప్పుడు “పుష్ప:ది రైజ్” హిందీ వెర్షన్ జనవరి 6 వ తేదీ హంసిని ఎంటర్ టైన్ మెంట్ , క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ఓవర్సీస్‌లో భారీ ఎత్తున్న రిలీజ్ చేస్తున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: