టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమా కూడా థమన్ ను తమ ప్రాజెక్ట్ లో జాయిన్ చేసుకుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమా కోసం నార్త్ కు వేరే, సౌత్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అయినా కూడా ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం స్పెషల్ గా థమన్ ను తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. థమన్ పై ఎంత నమ్మకం ఉందో. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒక వైపు పెద్ద సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు థమన్ కొన్ని చిన్న సినిమాలకు కూడా సాయం చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాకు తను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
కాగా ఈసినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: