మైథలాజికల్ మూవీ “బ్రహ్మర్షి విశ్వామిత్ర “(1991)మూవీ తో బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ , 3000 బాలనటులతో రూపొందిన “రామాయణం “మూవీ లో ఎన్టీఆర్ రాముడుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “రామాయణం “మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “నిన్ను చూడాలని “మూవీ తో ఎన్టీఆర్ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో ఎన్టీఆర్ విజయయాత్ర కొనసాగిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”మూవీ జనవరి 7వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#NTR30” మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అద్భుత డ్యాన్సర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతారన్న విషయం తెలిసిందే. తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను హీరోగా తెరకెక్కిన “ఆంధ్రావాలా”(2004 )మూవీ ఆడియో లాంచ్‌కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారనీ , వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందనీ ఎన్టీఆర్ వెల్లడించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: