సీనియర్ నటి ఖుష్బూ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కు సోషల్ మీడియా వేదికగా సర్ ప్రైజ్ ఇచ్చారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటంటే ఖుష్బూ తన ట్విట్టర్ ద్వారా రానా చిన్నప్పటి ఫొటోను పోస్ట్ చేసింది. కలియుగ పాండవులు సినిమాతోనే వెంకటేష్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంతోనే ఖుష్బూ కూడా హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. వెంకీ, ఖుష్బూ జంటగా నటించిన ఆ మూవీ ఇద్దరికీ మొదటి చిత్రమైనా కూడా మంచి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరూ జంటగా త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఇక అప్పట్లో రానా చిన్న పిల్లాడు. అప్పుడు వెంకీ తో తీసుకున్న ఫొటోనే ఇప్పుడు ఖుష్బూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. హేయ్ జూనియర్, నా వార్డ్ రోబ్ లో ఏం దొరికిందో చూడు! ఇలాంటివి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి ఉంటూ రానా ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక రానా కూడా ఖుష్బూ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ.. వావ్ వావ్ మీకు కూడా న్యూయర్ విషెస్ అంటూ రిప్లై ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wow wow thank you 🥰🥰 and Haopy new year to you ❤️❤️❤️ https://t.co/je9kt3z4rm
— Rana Daggubati (@RanaDaggubati) January 3, 2022
ఇక రానా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. దీనితో పాటు 1945 సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇంకా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: