మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప: ది రైజ్” మూవీకి అన్ని భాషలలోనూ అద్భుత స్పందన లభించడంతో మేకర్స్ మరియు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను జరుపుకున్నారు. సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ .. ఆయా భాషల్లో వస్తున్న ఆదరణ అక్కడ తమ సినిమాని ప్రెజెంట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి థ్యాంక్స్ అనీ , అలాగే నార్త్ ఆడియెన్స్ లో తనని టెస్ట్ చేసుకోడం కోసమే “పుష్ప” మూవీ ని హిందీ రిలీజ్ ప్రయత్నం చేశామనీ , ఇక ఇదే సమయంలో “పుష్ప 2” పై మాట్లాడుతూ ఈ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా రిలీజ్ చేయనన్ని భాషల్లో రిలీజ్ చేస్తామనీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సగర్వంగా ప్రకటించారు.
Watch Team #PushpaTheRise Thank You Meet LIVE Now!! @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @PushpaMovie #PushpaTheRiseInTheatres #Pushpa https://t.co/MNfOdcHD6j
— Telugu FilmNagar (@telugufilmnagar) December 28, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: