సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “క్షణం “, “రంగస్థలం“మూవీస్ లో అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “, “ఖిలాడి “, “ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Meet Alice 😊
Thank you @neerad_amal Sir ❤️ @mammukka Sir ❤️🥰 for allowing me to be your Alice.. 🙏🏻 Couldn’t dream of a better debut in Malayalam Cinema 😇#BheeshmaParvam
Posted @withregram • @amalneerad_official Anasuya Garu ❤️🙏🏽 pic.twitter.com/rUaJHDYfWj
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 28, 2021
అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా “భీష్మ పర్వం “మలయాళ మూవీలో అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అనసూయ తన పాత్ర పేరుఅలీస్ అనీ , క్యారెక్టర్ లుక్‌కు సంబంధించిన అప్డేట్‌ని ఇచ్చి అమల్ నీరద్ సర్, మమ్ముట్టి సర్‌లకు థ్యాంక్స్ అన్నారు. అనసూయ ఇంతకుముందు మమ్ముట్టి తో “యాత్ర”మూవీ లో నటించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: