ఆ ఒక్కటీ అడక్కు 3 డేస్ కలెక్షన్స్ 

Aa Okkati Adakku 3days collections
అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీసు వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ సీజన్ ను తట్టుకొని పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది.గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈసినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.14కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.4కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈసినిమా మరో రెండు కోట్లను రాబడితే  బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈవారంలో ఆ మార్క్ చేరుకొనే  ఛాన్స్ వుంది. 
 
అదే జరిగితే అల్లరి నరేష్ కెరీర్ లో ఆ ఒక్కటీ అడక్కుతో మరో హిట్ పడ్డట్లే.మల్లి అంకం ఈసినిమాను డైరెక్ట్ చేయగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.గోపిసుందర్ సంగీతం అందించాడు.రాజీవ్ చిలక ఈసినిమాను నిర్మించాడు. 
 
ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం బచ్చలమల్లి అనే సినిమా చేస్తున్నాడు.ఈనెల 8నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇందుకోసం ఓ భారీ జాతర సెట్ ను వేశారు. సుబ్బు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.రాజేష్ దండా నిర్మిస్తున్న ఈసినిమా ఈఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 8 =