డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.తెలుగు వెర్షన్ ట్రైలర్ 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రైలర్ గా రికార్డ్ సెట్ చేసింది. 20 మిలియన్ వ్యూస్ కు దగ్గరగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రౌద్రం రణం రుధిరం ” మూవీ హిందీ ట్రైలర్‌ను మేకర్స్ ముంబై లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, ఆలియాభట్, నిర్మాత దానయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. జనవరి 7న విడుదల కానున్న ఈ చిత్రానికి హిందీ విమర్శకులు, ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నానానీ , దేశంలో పెద్ద స్టార్స్‌తో పనిచేయాలనేది తన కల అనీ , కరోనా కారణంగా భారతీయ సినిమా కోల్పోయిన వైభవాన్నిఈ మూవీ తీసుకొస్తుందని నమ్ముతున్నాననీ ఎన్టీఆర్ చెప్పారు.టాలీవుడ్ ప్రేక్షకుల వలే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్ ఇస్తున్నారు. హిందీ వెర్షన్ ట్రైలర్ కూడా 17 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దూసుకుపోతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: