నాగశౌర్య ‘లక్ష్య’ రివ్యూ

Naga Shaurya's Lakshya Telugu Movie Review,Lakshya Telugu Movie Review,Naga Shaurya,Ketika Sharma,Dheerendra Santhossh Jagarlapudi,Jagapathi Babu,Kaala Bhairava,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya 2021,Lakshya Review,Lakshya Movie Review,Naga Shaurya Lakshya Review,Naga Shaurya Lakshya Movie Review,Lakshya Updates,Lakshya Update,Lakshya Movie Updates,Lakshya Movie Update,Lakshya Latest Update,Lakshya Movie Latest Updates,Lakshya Telugu Movie Updates,Lakshya Movie News,Lakshya Telugu Movie Latest News,Lakshya Live Updates,Lakshya Movie Live Updates,Lakshya Telugu Movie Live Updates,Lakshya Public Talk,Lakshya Movie Public Talk,Lakshya Movie Public Response,Lakshya Movie Rating,Lakshya Movie Review And Rating,Lakshya Movie Public Talk And Public Response,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Latest Telugu Reviews,Latest Telugu Movies 2021,Telugu Movie Reviews,Latest Tollywood Review,Latest Telugu Movie Reviews,2021 Latest Telugu Movie Reviews,Latest Movie Reviews,New Telugu Movie,New Telugu Movies 2021,Telugu Movies,Latest Telugu Movie Reviews 2021,New Telugu Movie Review,Lakshya Trailer,Lakshya Teaser,Lakshya Movie Songs,Lakshya Theatrical Trailer,Lakshya Movie 2021,Lakshya Movie Teaser,Lakshya Naga Shourya,Lakshya Movie Trailer,Lakshya Official Trailer,Lakshya Songs,Lakshya Movie Story,#Lakshya,#NagaShaurya

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి వచ్చిన పోస్టర్లు కానీ,టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను ఈసినిమా రీచ్ అయిందా?లేదాా? అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, కేతిక శ‌ర్మ‌, స‌చిన్ ఖేడేకర్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌విప్రకాష్‌, స‌త్య‌, శత్రు, వైవా హ‌ర్ష, త‌దిత‌రులు
డైరెక్టర్.. సంతోష్ జాగ‌ర్లపూడి
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత‌లు: నారాయణ్ దాస్ కే నారంగ్, పుష్కర్ రామ్ మోహన్‌రావు,శరత్ మరార్‌
సంగీతం: కాల భైర‌వ‌
సినిమాటోగ్రఫి.. రామ్‌రెడ్డి

కథ..

రఘురామయ్య(సచిన్‌ ఖేడేకర్‌) మనవడు పార్ధు(నాగశౌర్య). చిన్నప్పుడే పార్థు తల్లిదండ్రులు చనిపోవడంతో తాతయ్య దగ్గరే పెరుగుతాడు. ఇక తండ్రికి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం ఉండటంతో మనవడికి కోచింగ్ ఇప్పిస్తాడు. అందుకోసం తన ఆస్తులను సైతం అమ్ముకుంటాడు. అలా పార్ధు కూడా కష్టపడి స్టేట్ లెవన్‌ చాంపియన్‌ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌ ట్రయల్స్‌కి ప్రిపేర్ అవుతున్న సమయంలో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురవుతాడు. మత్తు పదార్ధాలకు కూడా బానిస అవుతాడు. అలాంటి పరిస్థితుల్లో పార్థసారధి(జగపతిబాబు) కలిసిన తర్వాత పార్థు జీవితంలో మార్పు వస్తుంది. మరి పార్థు ఆ సమస్యను ఎలా అధిగమిస్తాడు…? తిరిగి మళ్లీ ఆర్చరీలో ఎలా రాణిస్తాడు..? వరల్డ్‌ చాంపియన్‌గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? అనేదే మిగతా కథ.

ఇక డైరెక్టర్ విషయానికొస్తే మంచి పాయింట్ నే తీసుకున్నాడు. నిజానికి స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజే ఉంటుంది.. దానికి తోడు మంచి స్క్రీన్ ప్లే ఉంటే సినిమా హిట్ అయిపోయినట్టే. అందులోనూ స్పోర్ట్ నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చినా ఆర్చరీ నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా అవ్వడం ఈసినిమాకు కలిసొచ్చిన అంశం. ఇక ఈసినిమా ఫస్ట్ హాఫ్ ఒలింపిక్స్ అర్హత పోటీలు.. ఆతరువాత పార్థు బాల్యం.. ఆర్చరీలో కోచింగ్ తీసుకోవడం.. తాత మనవళ్ల మధ్య అనుబంధం,, పార్థు తాత మ‌ర‌ణం ఇలా పలు అంశాలు చూపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ లో పార్థు త‌న ల‌క్ష్య సాధ‌న కోసం తిరిగి ఎలా స‌న్నద్ధమ‌య్యాడు.. ఈ క్రమంలో పార్థసార‌ధి అత‌నికెలా సాయ‌ప‌డ్డాడు.. పార్థు ఎలా గోల్ రీచ్ అయ్యాడు లాంటి విషయాలు చూపించాడు.

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగ‌శౌర్య .. ఆ మూవీతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వైవిధ్యాన్నిచూపిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఒకప్పుడు లవర్ బాయ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించినా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో ఒక సినిమానే ఈ లక్ష్య. ఈసినిమా కోసం నాగశౌర్య ఎంత కష్టపడ్డాడో చూశాం. ఈసినిమాలో సిక్స్ ప్యాక్ తో కొత్త మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్చరీ ప్లేయర్‌ పార్థుగా నాగశౌర్య చాలా బాగా నటించాడు. అతను పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఇక రొమాంటిక్ సినిమాతో పరిచయం అయిన కేతికా శర్మ… ఈసినిమాలో గ్లామర్ పాత్ర కాకుండా తన నటనతో ఆకట్టుకుంది. హీరో తాతయ్యగా సచిన్‌ ఖేడేకర్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. పాటల సంగతి పక్కన పెడితే కాల భైర‌వ అందించిన నేప‌థ్య సంగీతం మాత్రం ఆక‌ట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే అందరూ ఒకసారి చూసే సినిమా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు ఇష్టపడే వారికి మరింత నచ్చుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =