రాజమౌళి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కథల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు. ఇక అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఉండటంతో ఈ ట్రైలర్ పై అందరూ ప్రసంశలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఇక్కడ పలు ప్రెస్ మీట్ లలో పాల్గొంటుండగా.. ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో ముంబై కూడా వెళ్లారు. ఇక తాజాగా కన్నడ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు మేకర్స్. ఇక ఈసందర్బంగా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈనేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ ను మరోసారి ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. దీనిలో భాగంగానే గెలయా గెలయా అనే పాటను కూడా పాడి ఎమోషనల్ అయ్యారు.
This will surely make you Emotional!!
Young Tiger #JrNTR Sings #GeleyaGeleya at #RRRMovie Press Meet @ Banglore! #PuneethRajkumar #NTR #RRR #TeluguFilmNagar pic.twitter.com/uz3clxqXQd— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2021
కాగా పునీత్ రాజ్ కుమార్ కు ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉండేదన్న సంగతి తెలిసిందే. 2016లో ఎమ్ శరవణన్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్టైనర్ చక్రవ్యూహ మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. గెలయా గెలయా.. అంటూ సాగే ఓ జోష్ ఫుల్ సాంగ్ ని ఎన్టీఆర్ స్వయంగా పాడడం జరిగింది. ఈసినిమాలో ఈపాట ప్రత్యేకంగా నిలిచింది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: