ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అందుకే ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఇప్పటికే ట్రైలర్ తో ఈసినిమా క్రేజ్ ను ఆకాశానికి తీసుకెళ్లారు మేకర్స్. ట్రైలర్ ను చూసినవారంతా ముఖ్యంగా బన్నీ మేకోవర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రైలర్ లో అసలు కథతో పాటు సినిమాలో ఉన్న కీలక పాత్రలను చూపించాడు. అలాగే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ కూడా ఆకట్టుకుంటున్నాయి. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా చూపించాడు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మొదలైంది అందరికీ. మొత్తంగా ట్రైలర్ అయితే అందరికీ నచ్చడంతోపాటు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ కు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది కనుక చిత్రయూనిట్ అప్పటివరకూ ఫుల్ బజ్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. దీనిలో భాగంగానే మరో రెండు సాలిడ్ అప్ డేట్లు ఇవ్వనున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే కదా. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి అలానే స్పెషల్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్లు ఇస్తున్నట్టు ఇంతకుముందే తెలిపారు. ఇప్పుడు వాటికి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాలో సమంత చేస్తున్న స్పెషల్ సాంగ్ కు సంబంధించి లిరికల్ వీడియోను డిసెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
This winter is going to get heated up with Queen @Samanthaprabhu2‘s moves 🔥🔥
‘Sizzling Song of The Year’ from #PushpaTheRise on 10th DEC 💥#OoAntavaOoOoAntava #OoAnthiyaOoOoAnthiya #OoSolriyaOoOoSolriya #OoChollunnoOoOoChollunno #OoBolegaYaOoOoBolega#PushpaTheRiseOnDec17 pic.twitter.com/NKtAyyfT4w
— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2021
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు, ధనంజయ్ ముఖ్యపాత్రలలో నటించారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: