సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాకు ఇది రీమేక్ అని తెలిసిందే. ఇక ఈసినిమాను మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను యాడ్ చేసి తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు, టీజర్ చూస్తే ఈ విషయం ఇప్పటికే అర్థమైపోయింది. ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈసినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇప్పటికీ పలు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మేకర్స్ ఆ వార్తలకు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా కూాడా మళ్లీ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కష్టం అంటూ వార్తలు వస్తున్నాయి. మళ్లీ దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇప్పుడే లాలా భీమ్లా రష్ చూడడం జరిగిందని.. మార్క్ చేసుకోండి జనవరి 12 థియేటర్లలో బ్లాస్ట్ ఉంటుంది అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Just saw the Video Rush of #LaLaBheemla 🥁
Mark it guys, You’re in for a BLAST on 12th JAN 2022 in THEATRES 💥🔥#BHEEMLANAYAKon12thJAN pic.twitter.com/OvBkrdULG6
— Naga Vamsi (@vamsi84) December 7, 2021
కాగా ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’ పాత్రలో పవన్ కళ్యాణ్.. డేనియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: