ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో నటవిశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ.. బోయపాటిల హ్యాట్రిక్ మూవీ “అఖండ” మూవీ గురు వారం విడుదల అయ్యి ఆదివారం వరకు అంటే నాలుగు రోజుల పాటు భారీగా వసూళ్లు రాబట్టింది. ప్రతీ హిట్ సినిమాకి వీకెండ్ కలెక్షన్స్ బాగుంటాయి. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. బి మరియు సి సెంటర్ ల్లో అఖండమైన వసూళ్లను “అఖండ “మూవీ సోమవారం కూడా రాబట్టింది. గత రెండేళ్ల కాలంలో వర్కింగ్ డేస్ ల్లో ఏ ఒక్క సినిమాకు రాని వసూళ్లు ఈ సినిమాకి రావడం విశేషం. ఈమద్య కాలంలో అన్ని క్లాస్ మూవీస్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అఖండ సినిమాకు ఆధరణ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఒక్క బాలయ్య అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అఖండ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వర్కింగ్ డేస్ లో కూడా అఖండ మంచి వసూళ్లు దక్కించుకుంటుంది. ఇదే జోరు శుక్రవారం వరకు కొనసాగితే మళ్లీ శని ఆదివారాల్లో అఖండ భారీ వసూళ్లు నమోదు చేసి బాలయ్య కెరీర్ లోనే టాప్ వసూళ్లు సాధించిన సినిమా గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: