బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ పలు మూవీస్ కు కమిట్ అయ్యారు. సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ 2022 మార్చి 25వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. నెలన్నర గ్యాప్ లో హీరో రవితేజ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ” ధమాకా ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రవితేజ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ, వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: