దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన సినిమా రిపబ్లిక్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ అయినప్పుడు సాయి తేజ్ పరిస్థితి అంత బాలేదన్న సంగతి తెలిసిందే. అప్పటికే సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై చికిత్స తీసుకుంటున్నాడు. దీనివల్ల సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే మేకర్స్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈసినిమా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మీతో కలిసి చూడలేక పోయానని ఇప్పటికే సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే నేడు ఈసినిమా నిన్నటినుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా సాయితేజ్ తన సినిమాను ఓటీటీలో చూస్తూ మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాకుండా ఈసినిమాలో పంజా అభిరామ్ పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని.. సినిమా టీమ్ తో కలిసి మూవీ చూస్తున్నానని.. మీరు కూడా జాయిన్ అవ్వండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Firstly, Thank you all for the love you’re showering for #RepublicOnZee5.
This Friday remains very special for me as I have loved playing Panja Abhiram and yearned to watch with you all.
I am watching with team and happy to see you all joining in 🤗#Republic pic.twitter.com/DMgP573tGL— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 26, 2021
కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటించగా.. రమ్యకృష్ణ, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: