డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది.యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” , మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర1” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “#NTR31” మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఎవరు మీలో కోటీశ్వరులు “టీవీ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. తనదైన స్టైల్ లో ఆ ప్రోగ్రామ్ ను ఎన్టీఆర్ రక్తి కట్టిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీస్ లో “తొలిప్రేమ ” మూవీ తన ఫేవరెట్ మూవీ అని ఎన్టీఆర్ వెల్లడించారు. ఎన్టీఆర్ అలా చెప్పడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు , ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: