“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటించారు. “అఖండ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రగ్య జైస్వాల్ మాట్లాడుతూ .. “అఖండ ” మూవీలో ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లో నటించాననీ , తన సినీ కెరీర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ మెమొరబుల్ క్యారెక్టర్ అనీ , ఇటువంటి క్యారెక్టర్ లో ఇంత వరకూ నటించలేదనీ , బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో గ్రేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందనీ , “అఖండ ” మూవీ రిలీజ్ కై ఆసక్తి తో , ఆతృత గా ఎదురు చుస్తున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: