శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా అనుభవించు రాజా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కిస్తున్నట్టు అర్థమవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో మరోసారి కామెడీ యాంగిల్ ను చూపించారు. సిటీ ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్లు కూడా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. ఇంకా అజయ్ మరియు రాజ్ తరుణ్ ల మధ్య వచ్చే కామెడీలతో ఫన్ ఫిల్డ్ ట్రైలర్ గా ఆకట్టుకుంటుంది.
Life is full of ups and downs but you can still have fun!! 👉 https://t.co/OoD47Qx5ND @AnnapurnaStdios @SVCLLP @itsRajTarun @Kashishkhannn @GavireddySreenu @deepu_music @bhaskarabhatla @GopiSundarOffl @adityamusic#ARonNov26th pic.twitter.com/HnstVQqHJH
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 17, 2021
ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మోడల్ కాషిశ్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.
మరి రాజ్ తరుణ్ కు కూడా హిట్ పడి చాలా కాలం అవుతుంది. దాంతో ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు రాజ్ తరుణ్.. మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: