పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్”మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం”, “గాడ్సే”, “స్కైలాబ్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు” హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు హరీష్ శంకర్ , మరొక నిర్మాతతో కలిసి తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ “వేదాంతం రాఘవయ్య ” మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నుండి నిర్మాత అనిల్ సుంకర , హీరో సునీల్ వైదొలగడంతో హీరో గా సత్యదేవ్ ని సంప్రదించినట్టు , సత్యదేవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ కి హరీష్ శంకర్ కథను అందించడంవిశేషం . త్వరలోనే ఈ మూవీ పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: