ప్రియదర్శన్ దర్శకత్వంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ మరక్కార్. కేరళ నేవీ ఆఫీసర్‌గా చేసిన కుంజాలీ మరక్కార్ 4 జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 2న ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో కీర్తి సురేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఈసినిమా నుండి కీర్తి సురేష్ కు సంబంధించి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కీర్తి సురేష్ కూడా తన ట్విట్టర్ ద్వారా పోస్టర్ ను షేర్ చేస్తూ అర్చ గా ఈసినిమాలో నటిస్తున్నట్టు తెలిపింది. ఇక పోస్టర్ లో కీర్తి లుక్ మాత్రం ఆకట్టుకుంటుంది.
Thrilled to be portraying the charming and valiant #Aarcha! ❤️
Get ready to witness the grand spectacle of #Marakkar. Coming to a screen near you on December 2nd!@Mohanlal @priyadarshandir @SunielVShetty #PrabhuGaneshan @sabucyril @DOP_Tirru @akarjunofficial @ManjuWarrier4 pic.twitter.com/AKkCmv7Lni
— Keerthy Suresh (@KeerthyOfficial) November 15, 2021
ఇక ఈసినిమాలో మోహన్ లాల్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. మోహన్ లాల్ టీనేజ్‌లో ఉండే పాత్రను చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ అతడి ప్రేయసిగా నటిస్తుంది. మంజు వారియర్, అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, సిద్ధిఖ్, నెడుముడి వేణు, ఫాజిల్, సుహాసిని మణిరత్నం, రంజిఫణిక్కర్, మాముక్కోయ, హరీశ్ పేరడి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: