తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నంత మంది కమెడియన్స్ మరే ఇండస్ట్రీలోనూ లేరన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో ఏ ఇద్దరు టాప్ కమెడియన్లు ఒకే సినిమాలో కనిపించరు. అంత ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అలా ఉండదు. ఒకే సినిమాలో.. 30 మంది కలిసి నటించమన్నా కూడా నటిస్తారు. అంత ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఈ కమెడియన్లంతా కలిసి ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పుతున్నారు. కలిసుంటే కలదు సుఖం అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొన్నేళ్లుగా కమెడియన్స్ ఓ పద్దతి ఫాలో అవుతున్నారు. ఖాళీ ఉన్నపుడు కలిసి పార్టీ చేసుకోవాలని అనుకున్నారు. అందుకు తగినట్లుగానే కుదిరినప్పుడల్లా కలుసుకుంటున్నారు. 2018 సంవత్సరంలో ఈ పార్టీ కల్చర్ ప్రారంభం అయ్యింది. కలుసుకున్న ప్రతి సారీ కమెడియన్స్ ఓ థీమ్ తో కలుస్తున్నారు. ఒకసారి వెన్నెల కిషోర్ ఇంట్లో కలుసుకున్నపుడు అంతా బ్యాక్ టూ స్కూల్ అంటూ అంతా స్కూల్ డ్రస్ లో కనిపించారు. ఆ తర్వాత “చందమామ” థీమ్ పంచెల కాస్ట్యూమ్ వేసుకున్నారు. తరువాత “కూలి నెంబర్ వన్” థీమ్ తో కమెడియన్స్ సందడి చేశారు . ఆ పార్టీ కమెడియన్ ప్రవీణ్ ఇంట్లో జరిగింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి కమెడియన్స్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ధన్ రాజ్ ఈ పార్టీ ఫోటోస్ ను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న 9 మంది కమెడియన్స్ ఇందులో ఉన్నారు. వెన్నెల కిషోర్ ,వేణు, సత్య, నవీన్, సప్తగిరి, చిత్రం శ్రీను, ధన్ రాజ్, సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: