‘ఎన్టీఆర్’ 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు

21 Magical Years for Jr NTR in Telugu Film Industry,Young Tiger NTR Completes 21 Years of Remarkable Career,Young Tiger NTR,NTR,Jr NTR,Jr NTR Completes 21 Years of Career,Jr NTR Completes 21 Glorious Years In The Industry,Man Of Masses NTR,21 Years Of NTR,21 Years Of Jr NTR,21 Years For NTR,21 Years For Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,21 Magical Years of Young Tiger NTR In Film Industry,21 Magical Years of NTR In Film Industry,Young Tiger NTR First Hit Completes 21 Years,Jr NTR 21 Years in TFI,Komaram Bheeem NTR,Jr NTR Complets 21 Successful Years In TFI,Jr NTR Complets 21 Years In TFI,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR New Movies,Jr NTR Latest Movie,Jr NTR Latest Movies,Jr NTR New Movie Updates,Jr NTR Latest Movie Updates,Jr NTR Latest News,Jr NTR Latest Film Updates,Jr NTR Updates,Jr NTR Movie Updates,Jr NTR Upcoming Movies,Jr NTR Next Movies,Jr NTR RRR,NTR RRR,NTR RRR Movie,RRR,RRR Movie,RRR Updates,NTR 31,NTR 31 Movie,NTR31,Jr NTR Movie Career,Jr NTR Movie Journey,21 Years For Jr NTR in Telugu Film Industry,Ninnu Choodalani,Jai Lava Kusa,Aravinda Sametha Veera Raghava,Janatha Garage,Nannaku Prematho,Temper,Adhurs,Yamadonga,Aadi,Student No 1,Jr NTR Movie News,NTR 30,#21MagicalYearsOfNTR,#21YearsofNTR,#JrNTR

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. డైలాగ్ ను స్పష్టంగా చెప్పడంలో కానీ, ఎంత పెద్ద సీన్ అయినా సరే సింగిల్ టేక్ లో చేసేయడంలో ఎన్టీఆర్ దిట్ట. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. డైలాగ్స్ దగ్గర నుండి యాక్టింగ్, డ్యాన్స్ ఇలా ప్రతి విషయంలో తన మార్క్ ను చూపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలనటుడిగా ఎన్టీఆర్ చిన్నప్పుడే తన నటన చూపించాడు. ‘ బాల రామయణం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ రాముడిగా తన నటనతో అలరించి అప్పుడే నంది అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి’ విశ్వామిత్ర’లో భరతుడిగా నటించాడు ఎన్టీఆర్. ఆ సినిమా విడుదల కాలేకపోయింది.

ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. సరిగ్గా ఈరోజే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆతరువాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 సినిమాతో హీరోగా తొలిసారి సక్సెస్ రుచి చూసాడు జూనియర్ ఎన్టీఆర్.ఆ తరువాత వచ్చిన ‘సుబ్బు’ కాస్త నిరాశ పరిచినా ‘ఆది’ సినిమాతో మాస్ హీరో అనిపించుకున్నాడు. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొట్టిన డైలాగ్ ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ అన్న డైలాగ్ ఇప్పటికీ పాపులర్ గానే ఉంది. వివీ వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు, నాగ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలా వరుసగా రెండు ఫ్లాప్స్ రావడంతో కాస్త ఇబ్బందిపడ్డా రాజమౌళి సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కు బూస్ట్ ను ఇచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్డడమే కాకుండా ఎన్టీఆర్ కు స్టార్ హీరో రేంజ్ ను ఇచ్చింది.

కానీ సింహాద్రి తరువాత వచ్చిన ‘ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, వరుస ప్లాపులు ఎదురయ్యాయి. ఇక ఎన్టీఆర్ కూడా వరుస ఫ్లాప్స్ రావడంతో నిరాశలో ఉండగా కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘రాఖీ’ సినిమా కాస్త ఊరటనిచ్చింది ఆ తరువాత ‘యమదొంగ’ నిరాశ పరిచినా ‘అదుర్స్’ కామెడీతో అలరించాడు. మధ్యలో ఊసరవెల్లి బృందావనం, బాద్ షా సినిమాలతో ఒక మోస్తరు విజయాలు అందుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్ ’ నుంచి మళ్లీ ఎన్టీఆర్ హవా సాగింది. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ సినిమాలతో వరకు వరుసగా విజయాలందుకున్నాడు.

ప్రస్తుతం అయితే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. త్వరలో కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇంకా కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కూడా మరో ప్రాజెక్ట్ ను చేయనున్నాడు. ఇక రెండు దశాబ్దాలకు పైన ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ పాత్రలతో అలరించాడు ఎన్టీఆర్. మరి ముందు ముందు కూడా ఎన్టీఆర్ ఇలానే ఎన్నో సినిమాలతో డిఫరెంట్ పాత్రలతో అలరించాలని కోరుకుందాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − nine =