టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.“ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Last day, last shot and tons of amazing memories but the journey is not over yet!
See you soon darling #Prabhas#Adipurush #AboutLastNight pic.twitter.com/rtB7KahopK
— Om Raut (@omraut) November 4, 2021
దీపావళి రోజున “ఆదిపురుష్”మూవీలో ప్రభాస్‌కు సంబంధించిన రాముడి పాత్ర షూటింగ్ పూర్తి చేశామని దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చివరి రోజు.. చివరి షాట్ ఇదే ననీ , ప్రభాస్‌తో జర్నీ చాలా హ్యాపీగా ఉందనీ , టన్నుల కొద్దీ అద్భుతమైన జ్ఞాపకాలనీ , కానీ ఈ ప్రయాణం ఇంకా ముగియలేదనీ , .సీయూ.. డార్లింగ్’ అంటూ ట్వీట్ చేస్తూ, మూడు ఫొటోలను కూడా దర్శకుడు షేర్ చేశారు. షూటింగ్ చివరి రోజు కేక్ కట్ చేసి ప్రభాస్‌కు ఓం రౌత్ తినిపించారు. “ఆదిపురుష్”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: