మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా “పక్కా కమర్షియల్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి పండగ సందర్భంగా “పక్కా కమర్షియల్” లోని గోపీచంద్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ గ్లింప్స్ ను విడుదల చేసి టీజర్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.”పక్కా కమర్షియల్” మూవీ టీజర్ ఈనెల 8న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. బారీ ఎత్తున అంచనాలున్న “పక్కా కమర్షియల్” మూవీ లో హీరో గోపీచంద్ పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం . “సిటీ మార్” మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో గోపీచంద్ “పక్కా కమర్షియల్” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: