ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ తో చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే త్వరలోనే చిత్ర బృందం మూడు రోజుల షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అది పూర్తయ్యాకా మైసూర్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంది. అందులో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో ‘థాంక్యూ’ చిత్రం మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఇక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. మరి మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. మరి ఈసినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: