ఒకటి కాదు రెండు కాదు ఈఏడాది ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆ మధ్య వరుసగా ఫ్లాప్స్ తో వెనుకబడిన రవితేజ ఈ ఏడాది గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మూడు సినిమాలు రవితేజ చేతిలో ఉన్నాయి. ఇప్పటికే ఖిలాడి సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో పాటు మరోవైపు శరత్ మండవ డైరెక్షన్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రవితేజ. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ధమాకా ప్రాజెక్ట్ ను తన 69 సినిమాగా అనౌన్స్ చెయ్యగా తాజాగా మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. దీనిలో భాగంగానే రవితేజ 70 వ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే టైటిల్ ను నవంబర్ 5న 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా తన 71 వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ ను నవంబర్ 3 వ తేదీన మధ్యాహ్నం 12:06 గంటలకు చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: