లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా వరుడు కావలెను. ఈసినిమాపై మొదటి నుండి మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాల మధ్యే ఈరోజు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. అన్న విషయాలు తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నాగశౌర్య, రీతూవర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు
డైరెక్టర్.. లక్ష్మీ సౌజన్య
నిర్మాత..సూర్యదేవర నాగవంశీ
బ్యానర్.. సితార ఎంటర్ టైన్మెంట్స్
సంగీతం.. విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫి.. సాయిరామ్
కథ
ఆకాష్ (నాగశౌర్య) విదేశాల్లో స్థిరపడిన ఓ ఆర్కెటిక్. అయితే వర్క్ పనిమీద ఇండియాకి వచ్చిన ఆకాష్ భూమిక (రీతూ వర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ భూమిక ఓ కంపెనీకి బాస్. అంతేకాదు చాలా స్ట్రిక్ట్. దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లి (నదియా) సంబంధాలు చూస్తుంటుంది. భూమి మాత్రం పెళ్లికి తిరస్కరిస్తూ వస్తుంది. అలాంటి భూమికను ప్రేమలో పడేయటానికి ఆకాష్ చాలా కష్టపడుతుంటాడు. ఇక భూమిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనుకునేలోపు నో చెప్తుంది. కట్ చేస్తే ఆకాష్ కు భూమిక కు ముందే పరిచయం ఉంటుంది. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నవారే. ఆకాష్ వేసిన ఒక ప్లాన్ వల్ల భూమిక మనసు మారుతుంది. మరి భూమి అలా మారడానికి కారణమేంటి? అసలు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది..? ఫైనల్ గ వీరిద్దరి కథ ఎలా సుఖాంతం అయింది అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ..
నాగ శౌర్య కూడా ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈమధ్య తన కథల్లో కాస్త విభిన్నత ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక కూల్ గా లవర్ బాయ్ పాత్రలు నాగశౌర్య బాగానే చేస్తాడన్న విషయం తెలిసిందే. ఈసినిమాలో కూడా అలాంటి పాత్రే కావడంతో చాలా సింపుల్ గా ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక ఈసినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందన్న సంగతి ముందే టీజర్, ట్రైలర్ లను చూస్తే అర్థమైంది. దానికి తగ్గట్టే ఈసినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన రీతూవర్మ తన పాత్రలో ఒదిగిపోయింది. ఖచ్చితంగా ఇది తన కెరీర్ లో గుర్తుండి పోయే పాత్ర అవ్వడమే కాకుండా మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మురళీశర్మ, నదియా కథానాయిక తల్లిదండ్రులుగా చక్కటి పాత్రల్లో మెప్పించారు. సప్తగిరి, వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ తమ కామెడీతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
ఇక డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తీసుకుంది చిన్న లైనే అయినా దానికి ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ కొట్టారు. మొదటి సినిమా అయినా కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేసింది. ఎక్కడా హడావుడి లేకుండా.. కమర్షియల్ ఎలిమెంట్స్ కు పోకుండా కూల్ గా సినిమాను లాగించేశారు. ముఖ్యంగా కాస్టింగ్ ను పర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకు నటీనటుల పర్ఫార్మెన్స్ ఒక ప్లస్ పాయింట్ అయితే డైలాగులు కూడా ప్రాణం పోసాయి.
సాంకేతిక విభాగానికి వస్తే వంశీ కెమెరా పనితనం చాలా బాగుంది. అందమైన లొకేషన్లు చూపించాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: