ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పండుగ సందర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆడవాళ్ళు మీకు జోహార్లు” మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ రాజమండ్రి లో ప్రారంభం అయ్యింది. తాజా షెడ్యూల్‌లో శర్వానంద్, రష్మిక లతో పాటు ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలను దర్శకుడు కిషోర్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ షూటింగ్ సుమారు 80 శాతం కంప్లీట్ కానుందని సమాచారం. హీరో శర్వానంద్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: