నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు జరిగిన ఈకార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను దక్కించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా రజినీ సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన అవార్డ్ ను తనకు సీనీ రంగానికి పరిచయంచేసిన కె. బాలచందర్, అలాగే తన సోదరుడు, ఇంకా డైరెక్టర్లు, కోస్టార్లు, ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ కి అంకితం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SuperstarRajinikanth pens a heartfelt note, dedicating and thanking all those responsible for #DadasahebPhalkeAward @rajinikanth @OfficialLathaRK@dhanushkraja @ash_r_dhanush@soundaryaarajni @VPSecretariat @ianuragthakur pic.twitter.com/0UnFsS10sC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2021
కాగా నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు రజినీ. ఇక ఇప్పుడు యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ రజినీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజినీ శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్నాడు. తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. దీపావళికి ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలాఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు పలువురు కి ఈ అవార్జులు దక్కాయి. ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి మనోజ్ భాజ్‌పాయ్ కి, తమిళ హీరో ధనుష్ కి అసురన్ సినిమాకు గాను, ‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: