మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, రెండు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉండటం, రీసెంట్ గా డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే కదా. దసరా పండుగ రోజు సాయి తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అందుకుగాను మెగా కాంపౌండ్ మొత్తం సాయ్ తేజ్ కు వెల్ కమ్ చెప్పారు. అంతేకాదు తేజ్ హెల్త్ అప్ డేట్స్ కూడా మెగా హీరోలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సాయి తేజ్ ను కలువగా తాాజాగా హరీష్ శంకర్ కూడా తేజ్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నా బ్రదర్ సాయ్ తేజ్ ను కలవడం జరిగింది.. తను చాలా ఫిట్ గా ఉన్నాడు.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్ అంటూ దీంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. అయితే ఇందులో తేజు మొహాన్ని మాత్రం చూపించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Met my brother @IamSaiDharamTej and had a wonderful talk … Happy to say that he is super fit and getting ready to conquer ..
ఫుల్లీ & మళ్ళీ లోడెడ్ 👍👍👍 pic.twitter.com/rhpBvZ0PHb
— Harish Shankar .S (@harish2you) October 20, 2021
ఇక గతంలో హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. భవదీయుడు భగవంతుడు అనే టైటిల్ తో తెరకెక్కుబోయే ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు సాయి తేజ్ ఇటీవలే రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: