యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. రాజావారు రాణి గారు” ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే SR కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో సమ్మతమే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈవీడియోలో హీరో హీరోయిన్లను, వారి క్యారెక్టర్లను పరిచయం చేశారు మేకర్స్.
హీరో కిరణ్ సైలెంట్ గా కనిపిస్తుంటే ఇక హీరోయిన్ మందుకొడుతూ .. సిగరెట్ తాగుతూ హీరో హీరోయిన్ల క్యారెక్టర్‌లో ఎంతో ఢిఫరెన్స్ కనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ కూడా సూపర్ గా ఆకట్టుకుంటుంది.
Start ayyindi ☺️https://t.co/LqyCFU8BWN
Hope you all like it 🙂 pic.twitter.com/neqT0MqTZZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 21, 2021
కాగా యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: