నాగచైతన్య హీరోగా రాబోతున్న న్యూ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ‘. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరో రెండు రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈసినిమా. ఇక సాధారణంగా ఏదైనా సినిమా చూసిన తరువాత సినిమా చూసిన తరువాత మన హీరోలు తమ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు లవ్ స్టోరీ గురించి తన ట్విట్టర్ ద్వారా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని తెలిపారు. దీంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికే అందరూ ఈసినిమా కోసం వెయిట చేస్తున్న నేపథ్యంలో మహేష్ ట్వీట్ ఇంకా హైప్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A film centered around dance… quite rare in Telugu cinema! Can’t wait to catch this one in the theatres. All the best team #LoveStory!
https://t.co/N3eZAfcXMA@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP
— Mahesh Babu (@urstrulyMahesh) September 21, 2021
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల చేయనున్నారు.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: