సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు. జగపతిబాబు నటించిన చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా రిపబ్లిక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో నటిస్తున్న జగపతిబాబు పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో జగపతిబాబు సాయి తేజ్ కు తండ్రిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు ఈసినిమాలో పబ్లిక్ సర్వెంట్ పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని.. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు దేవకట్టాకి థ్యాంక్స్ అని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడంలో డాక్టర్ ప్రాముఖ్యత ఉంటుందో.. అలానే సమాజం అభివృద్ధి చెందడంలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర కూడా అంతే ఉంటుంది.. పబ్లిక్ కు సేవ చేయడానికి దేవుడు పంపిన దేవ దూత లాంటివాడు అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: