శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ “ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి , బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ “లవ్‌స్టోరి” టైటిల్ విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించిందనీ ,. నాగచైతన్య జయాపజయాలను వినమ్రంగా స్వీకరిస్తాడనీ , సాయిపల్లవి అద్భుతమైన డ్యాన్సర్ అనీ , శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ప్రేక్షకులకు హత్తుకునేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారనీ, ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందనీ చెప్పారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ నాగచైతన్యను “లాల్‌సింగ్ చద్దా” షూటింగ్‌లో తొలిసారి కలిశాననీ , కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడనీ , అతని తల్లితండ్రులు చాలా సంస్కారంతో పెంచారనీ , సినిమా ట్రైలర్ చూశాను, తనకు బాగా నచ్చిందనీ , అందుకే స్వయంగా అడిగి మరీ ఈ కార్యక్రమానికి వచ్చాననీ , సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంట బాగుందనీ , ప్రదర్శన రంగానికి ఉత్తేజం ఇచ్చేలా “లవ్‌స్టోరీ ” సినిమాను థియేటర్లలో విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందంటూ చిత్ర నిర్మాతలను అభినందించారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ .. “లవ్ స్టోరీ ” మూవీ ని దర్శకుడు శేఖర్ కమ్ముల అద్భుతంగా తెరకెక్కించారనీ , తనను నటుడు గా మరో మెట్టు ఎక్కేలా చేశారనీ , టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. సాయిపల్లవి మాట్లాడుతూ .. చిరంజీవి గారి డ్యాన్స్ చూసి తన కూ అదే గ్రేస్ అలవాటు అయిందనీ , ఆయన తనను మెచ్చుకోవడం సంతోషంగా ఉందనీ చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి తో సాయి పల్లవి చిన్న డ్యాన్స్ స్టెప్ వేయించడం విశేషం. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… అమీర్ ఖాన్ , చిరంజీవిగారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందనీ ,మనం తీసే సినిమాలతో సమాజానికి ప్రయోజనం ఉండాలని భావిస్తాననీ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: