శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. తాజాగా “లవ్ స్టోరి” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ” మూవీ గురించి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య పలు విషయాలు పంచుకున్నారు. “లవ్ స్టోరీ” రెగ్యులర్ గా వచ్చే అబ్బాయి, అమ్మాయిని కలిసి ప్రేమలో పడే లవ్ డ్రామా కథ కాదనీ , చాలా క్లిష్ణమైన విషయాలను టచ్ చేస్తూ సినిమా సాగుతుందనీ , ఈ మూవీ కై దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నది నిజమేననీ , ఈ సమయంలో ఫిల్మ్ మేకింగ్ ను ఎంజాయ్ చేశాననీ , ఈ అనుభవం తనను ఉత్తమ నటుడిగా తీర్చిదిద్దిందనీ , ఈ మూవీ లో ఎక్కువ క్రెడిట్ సాయిపల్లవికి ఇవ్వాలనీ , తన డ్యాన్స్, నటనతో అద్బుతంగా ఆకట్టుకుంటుందనీ , కష్టతరమైన డ్యాన్స్ స్టెప్పులను సులభంగా ఎలా చేయాలో సాయిపల్లవి దగ్గరే నేర్చుకున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: