వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకూ సగానికి పైగా షూటింగ్ ను పూర్తిచేసుకోగా మిగిలిన భాగాన్ని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదట మైసూర్ లో షూట్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఆతరువాత ప్రత్యేక హౌస్ సెట్ ని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేసారు కానీ అదీ కుదరకపోవడంతో. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడే మిగిలిన భాగాన్ని మొత్తం పూర్తిచేయనున్నారట మేకర్స్. దీంతో ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























