తెలుగు , తమిళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో అందాల రాశీఖన్నా బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న వెబ్ సిరీస్, “రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్” వెబ్ సిరీస్ , ఒక క్రైమ్ , యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు ,తమిళ , హిందీ భాషల తన ప్రాజెక్ట్ ల కోసం చెన్నై- హైదరాబాద్- ముంబై నగరాల మధ్య అటూ ఇటూ ప్రయాణిస్తున్న రాశీఖన్నా మాట్లాడుతూ .. ప్రయాణాలు చేయడం కష్టం అనుకోననీ , ఆస్వాధిస్తూ పని చేయడం తన పద్ధతి అనీ , కాలి బొటనవేలి అంచుపై నిలిచి పని చేయగలిగేంత అవకాశం, అదృష్టం, శక్తి తనకు ఉన్నాయనీ , తన జర్నీలో తాను ఎక్కడికి చేరుకోవాలో దానికోసం చాలా కష్టపడ్డాననీ , దాని ఫలితంగా ఉత్తరాది దక్షిణాదిలోని వినోద పరిశ్రమలలో ఆసక్తికరమైన అవకాశాలు వచ్చాయనీ , తాను ఎల్లప్పుడూ తెలివైన నిర్ణయాలతో మంచి మనసుతో పని చేయాలనుకుంటున్నాననీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: