‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంలో సిద్దార్థ, జీవీ ప్రకాశ్ ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా ఒరేయ్ బామ్మర్ది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ఈసినిమాను రిలీజ్ చేస్తుండగా నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆలరించిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్, లిజోమల్ జోస్, కశ్మీర, మధుసూధనన్, దీప రామానుజమ్, ప్రేమ్ తదితరులు
డైరెక్టర్: శశి
నిర్మాత: ఎ.ఎన్.బాలాజీ
సంగీతం: సిద్ధు కుమార్
సినిమాటోగ్రాఫర్: ప్రసన్న ఎస్.కుమార్
కథ:
మదన్(జీవీ ప్రకాష్ కుమార్) రాజీ (లిజోమోల్ జోస్) అక్కా తమ్ముళ్లు. చిన్నప్పుడే వీరు తల్లిదండ్రులను కోల్పోవడంతో అక్కని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంటాడు మదన్. అయితే మదన్ కు బైక్ రేసులంటే చాలా ఇష్టం. మరోవైపు రాజశేఖర్ అలియాస్ రాజ్ (సిద్ధార్థ్) ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తుంటాడు. రూల్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. అలాంటి నేపథ్యంలో రాజ్‌కు మదన్ ఓ రోజు బైక్ రేసింగ్ చేస్తూ దొరికిపోతాడు. అంతేకాదు అందరి ముందు అవమానించి అరెస్ట్ చేసి ఓరోజంతా జైల్లో వేస్తాడు. దీంతో రాజ్‌పై పగ పెంచుకుంటాడు మదన్. తనని అందరి ముందు అవమానించిన అతన్ని దెబ్బకు దెబ్బ తీయాలని కసిగా ఎదురు చూస్తుంటాడు. ఇదిలా ఉండగా అనుకోకుండా రాజే తన అక్కకి భర్తగా.. తనకు బావగా వస్తాడు. దీంతో తన అక్కని కూడా దూరం పెడతాడు మదన్. తన బావ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని చూస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు మదన్ బైక్ దొంగతనం చేస్తారు. ఆ బండితో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి ఆ కేసులో మదన్‌ని ఇరికిస్తారు. దీంతో బామ్మర్దిని కాపాడుకునేందుకు రాజశేఖర్ రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజ్ తన బామ్మర్దిని ఎలా కాపాడాడు? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ..
ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న సిద్దార్థ ఆ తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటూ అటు తమిళ్ లోనూ.. ఇటు తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. ఇక మరోవైపు జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత సక్సెస్ అయ్యాడో తెలుసు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. ఇక ఒకపక్క మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూనే మరోపక్క ఈ మధ్య సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా చాలా వరకూ టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ లాగే నడుస్తుంది.
ఇక సిద్దార్థ కొత్త నటుడేమి కాదు.. తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో కూడా నిజాయితీ అండ్ స్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా ఎప్పటిలాగే తన నటనతో మెప్పించాడు. సిద్దార్థ్ తో పాటు ఈసినిమాకు మరో ప్లస్ పాయింట్ జీవీ ప్రకాష్. బైక్ రేసులంటూ తిరిగే యువకుడు మదన్ పాత్రలో జీవీ ప్రకాష్ పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా ప్రకాష్ రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్లు కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్‌తో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
బిచ్చగాడు డైరెక్టర్ కావడంతో ఆటోమేటిక్ గా ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. బిచ్చగాడు సినిమాలో ఎలాగైతే కొడుకుకు తన తల్లిమీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తాడో.. అలానే ఇప్పుడీ ‘ఒరేయ్ బామ్మర్ది’తో బావా బామ్మర్దుల అనుబంధాన్ని.. అక్కా తమ్ముళ్ల బంధాన్ని అలానే చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మదన్.. రాజ్ ల మధ్య జరిగే వార్..రాజ్ మదన్ ను పట్టుకోవడంతో అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని మదన్ ఎత్తులువేయడం వాటిని రాజ్ తిప్పి కొట్టడం జరుగుతుంది. ఇంటర్వెల్ టైంకు ముందు రాజీని రాజ్ పెళ్లి చేసుకోవడం.. ఈ క్రమంలో మదన్ – రాజ్‌ల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ద్వితీయార్ధంలో ఏం జరగనుందా? అన్న ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథలో చాలా మార్పులు వచ్చాయి. తన బామ్మర్దిని కాపాడం.. మద్యలో డ్రగ్ డీలర్ ఎంట్రీ.. అతన్నిఅరెస్ట్ చేసేందుకు రాజ్ ఎత్తుగడలు వేస్తుండటంటో కథ నడుస్తుంది.ప్రీక్లైమాక్స్‌లో వచ్చే రాజ్.. మదన్‌ల వచ్చే రేసింగ్ ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ రొటీన్ గానే ముగించేస్తారు.
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: