శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC15” మూవీ తెరకెక్కనుంది. హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కియారా అద్వానీ కథానాయిక .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అంజలి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ లో అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
“నాయాట్టు “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అంజలి ఎంపిక అయ్యారు. భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న పాన్ ఇండియా మూవీ “# RC15” లో అంజలి కి అవకాశం రావడం అదృష్టమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: