జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2014లో నారా రోహిత్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతినిధి ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను అలానే పాటలను రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The theatrical trailer for #Prathinidhi2 is here! Share your thoughts on what you think about it, guys! @murthyscribe https://t.co/0f0GdYotFr
— Rohith Nara (@IamRohithNara) April 19, 2024
కాగా ఈసినిమాలో సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: