ఓటీటీలోకి వచ్చేసిన ఆర్టికల్ 370.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Yami Gautam Starrer Article 370 Streaming in Netflix

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్, ప్రముఖ దక్షిణాది నటి ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘ఆర్టికల్ 370’. యామి గౌతమ్ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌గా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీపై పాజిటివ్ రివ్యూస్‌తో పాటు నెగిటివ్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా ఇందులో ఒక వ‌ర్గాన్ని అణచివేతకు గుర‌యిన‌ట్లు చూపించార‌ని, దీనికి మరో వర్గం కారణమంటూ ప్రొజెక్ట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక అర‌బ్ దేశాలు అయితే ఏకంగా ఈ సినిమాపై బ్యాన్ విధించడం చర్చనీయాంశమైంది. ఉత్తరభారతదేశంలో మాత్రం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆర్టికల్ 370’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడి జ‌రిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశం తెర‌పైకి వ‌స్తుంది. అయితే ఆర్టికల్‌ 370ను ర‌ద్దు చేసే క్ర‌మంలో కశ్మీర్‌లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి? అనే ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =