కరోనా వల్ల తెలుగు పరిశ్రమ ఎంతో మంది ప్రముఖులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక అన్నింటికంటే పెద్ద నష్టం లెజెండరీ సింగర్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూయడం. ఎస్పీ బాలు లాంటి సింగర్ లేరు ఇక ముందు కూడా అలాంటి సింగర్ రావడం అనేది అసాధ్యం. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆయన మృతి చెందిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా అందరూ ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో కూడా ఎస్పీ బాలుకి మ్యూజికల్ ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ప్రముఖ సింగర్స్ మాళవిక హరీష్, అనూప్ దివాకరన్, లక్ష్మీ రామస్వామి, కౌశిక్ గణేష్ లాంటి సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని బాలుకి సంబంధించిన పలు పాటలు పాడి ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ఆగష్ట్ 12 నుండి 20 వ తేదీ వరకూ జరగనుంది. ఇక కరోనా నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమాన్ని ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా నిర్వహించనున్నారు.
ఇక దాదాపు 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆయనకు మాత్రమే సాధ్యం. కేవలం గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగంలోనే ఆయన ఓ ప్రత్యేక అధ్యాయం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: