మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “,కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ “భారతీయుడు “, “జీన్స్ “, “ఒకే ఒక్కడు “, అపరిచితుడు “, “శివాజి “, “రోబో “, “2. 0” వంటి డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన శంకర్ ఎస్ దర్శకత్వంలో “#RC15″ మూవీ కి హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC15” మూవీ తెరకెక్కనుంది. హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కియారా అద్వానీ టాలీవుడ్ కు రీఎంట్రీ కానున్నట్టు సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ షూటింగ్ ఒక భారీ సాంగ్ తో ప్రారంభంకానుంది. ఆ సాంగ్ ను సంగీత దర్శకుడు కంపోజ్ చేసినట్టు , ఆ సాంగ్ కై ప్రత్యేక సెట్ రూపొందుతున్నట్టు సమాచారం. సాంగ్స్ స్పెషలిస్ట్ శంకర్ ఆ సాంగ్ తో హీరో రామ్ చరణ్ ను ఎలా పరిచయం చేయనున్నారో వేచి చూడాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: