శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “లాల్ సింగ్ చద్దా “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగచైతన్య ఇప్పుడు హారర్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. 8ఎపిసోడ్స్ తో రూపొందే ఈ హారర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుందని సమాచారం. “మనం “, “థ్యాంక్ యు” మూవీస్ తరువాత దర్శకుడు విక్రమ్ , హీరో నాగచైతన్య కాంబినేషన్ లో మూడవ ప్రాజెక్ట్ గా వెబ్ సిరీస్ రూపొందనుంది. “థ్యాంక్ యు” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: