టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే సత్యదేవ్ తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం, నిత్యమీనన్ తో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ స్కై లాబ్ చిత్రాలు చేస్తున్నాడు. ఇక వీటితోపాటు తిమ్మరుసు సినిమా కూడా చేస్తున్నాడు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో సత్యదేవ్ అడ్వకేట్ రోల్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ఈసినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing Satya garu @ActorSatyaDev , Mahesh @smkoneru and team #Thimmarusu the very best. Here’s the trailer https://t.co/Wfd5VRZ33t
Enjoy the movie in theaters
— Jr NTR (@tarak9999) July 26, 2021
కాగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, శృజన్ యెరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా ఈనెల 30న థియేటర్స్‌లో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: