ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన అల్లరి నరేష్ ఆ తరువాత స్లో అయ్యాడు. ఈమధ్యే మళ్లీ డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవలే నాంది లాంటి విభిన్నమైన సినిమాతో వచ్చిన ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. “సభకు నమస్కారం” పేరుతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. నవీన్ చంద్ర “సభకు నమస్కారం” సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు. నవీన్ చంద్ర నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. మరి చూద్దాం దీనిపై అధికారిక ప్రకటన ఇస్తారేమో..
కాగా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈసినిమాలో నటించే నటీనటులు తదితర విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: