విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్‌బస్టర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు విజయ్ ఆంటోని పుట్టినరోజు ఈ సందర్భంగా ‘బిచ్చగాడు’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బిచ్చగాడు 2’ టైటిల్ లుక్ ను రిలిజ్ చేశారు. కాళికాదేవి ఉగ్రరూపంతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మొదట ఈసినిమాను ప్రియా కృష్ణస్వామి డైరెక్ట్ చేయనున్నట్లు ప్రకటించినా ఇప్పుడు మాత్రం విజయ్ ఆంటోనినే దర్శకత్వ భాధ్యత్యలు నిర్వర్తించబోతున్నానని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘బిచ్చగాడు 2’ మూవీని 2022లో విడుదల చెయ్యనున్నారు.
Here’s the Title Look of the project very close to my heart – #Pichaikkaran2 #Bichagadu2 😊
Happy to be helming this project as the Director 😊@vijayantonyfilm @mrsvijayantony pic.twitter.com/vDB46jGg7N— vijayantony (@vijayantony) July 24, 2021
ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మరి ఇప్పటికే యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా అలరించిన విజయ్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారారు.. మరి డైరెక్టర్ గాఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: